Power Grid Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్ం 75 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఫీల్డ్ ఇంజినీర్లు (35), ఫీల్డ్ సూపర్‌వైజర్లు (40) ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
*అభ్యర్థుల వయసు 29 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు జూన్ 01, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..