AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PGCIL Recruitment: బీటెక్‌ అర్హతతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్ ఆండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆర్‌డీ సెక్టార్‌ రీఫార్మ్‌ స్కీమ్‌లో భాగంగా ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

PGCIL Recruitment: బీటెక్‌ అర్హతతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
Pgcil Recruitment
Narender Vaitla
| Edited By: |

Updated on: Nov 15, 2022 | 9:59 PM

Share

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్ ఆండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఉద్యోగాలను  కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆర్‌డీ సెక్టార్‌ రీఫార్మ్‌ స్కీమ్‌లో భాగంగా ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 800 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) (50), ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) (15), ఫీల్డ్ ఇంజినీర్ (ఐటీ) (15), ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్) (480), ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) (240) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 11-12-2022 నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. ఫీల్డ్‌ సూపర్ వైజర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 23,000 నుంచి రూ. 1,05,000 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 21-11-2022న ప్రారంభమై 11-12-2022 తేదీతో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..