
హైదరాబాద్, ఆగస్ట్ 20: సీబీఎస్సీ స్కూళ్లలోని 3 నుంచి 12వ తరగతి విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ఎన్‌సీఈఆర్‌టీ అనుబంధ బోధనాంశంగా ఆపరేషన్ సిందూర్‌ను చేర్చింది. ఈ మేరకు రెండు మాడ్యూళ్ల రూపంలో పాఠ్యాంశంగా జోడించింది. ‘ఆపరేషన్ సిందూర్-ఒక వీర గాథ’ అనే మాడ్యూల్‌ను 3 నుంచి 8వ తరగతి వరకు, ‘ఆపరేషన్ సిందూర్- ఆత్మగౌరవం కోసం సాహసిక ఎదురు దాడి‘ అనే మాడ్యూల్‌ను 9 నుంచి 12వ తరగతి వరకు పాఠ్య ప్రణాళికలలో NCERT చేర్చింది. దేశ పరాక్రమం గురించి పాఠశాల విద్యార్థులకు తెలియజెప్పి.. వారిని చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ఎన్‌సీఈఆర్‌టీ ఆపరేషన్ సిందూర్‌ను విద్యార్ధులకు పాఠ్యాంశంగా చేర్చినట్లు అధికారులు తెలిపారు. భారత్ పౌరులపై పాకిస్థాన్ ఉగ్రదాడి జరిపిన విధానాన్ని ఈ పాఠాల్లో పేర్కొన్నారు.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) డిసెంబర్-2025 TEE షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా పరీక్షల షెడ్యుల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాజా ప్రకటన మేరకు డిసెంబర్ 1, 2025 నుంచి జనవరి 8, 2026 వరకు రెండు షెషన్లలో ఉదయం 10 గంగల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్ (CSIR UGC NET-2025) తుది కీ విడుదలైంది. ఈ మేరకు నెషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. 2025 జూన్ సెషన్ పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.ac.in నుంచి ఫైనల్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా 2025 జులై 28న దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యో్గ వార్తల కోసం క్లిక్ చేయండి.