NVS Non-Teaching Recruitment 2024: నవోదయలో 1377 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు గడువు మళ్లీ పెంపు

దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును నవోదయ విద్యాలయ సమితి (NVS) మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం ఏప్రిల్‌ 30తో దరఖాస్తు గడువు ముగియగా, దానిని మే 7వరకు పొడిగించింది. తాజాగా ఆ గడువును మరోమారు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. దీంతో అభ్యర్థులు మే 14 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది..

NVS Non-Teaching Recruitment 2024: నవోదయలో 1377 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు గడువు మళ్లీ పెంపు
NVS Non-Teaching Recruitment 2024

Updated on: May 08, 2024 | 7:43 PM

న్యూఢిల్లీ, మే 8: దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును నవోదయ విద్యాలయ సమితి (NVS) మరోసారి పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం ఏప్రిల్‌ 30తో దరఖాస్తు గడువు ముగియగా, దానిని మే 7వరకు పొడిగించింది. తాజాగా ఆ గడువును మరోమారు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. దీంతో అభ్యర్థులు మే 14 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,377 నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఉద్యోగాన్ని బట్టి భారీ వేతనాలు ఇస్తారు. పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1500, ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.500 చొప్పున ఫీజు చెల్లించాలి

పోస్టుల వివరాలు ఇవే..

  • ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులు: 121
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 5
  • ఆడిట్‌ అసిస్టెంట్ పోస్టులు 12
  • జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ పోస్టులు: 4
  • లీగల్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • స్టెనోగ్రాఫర్ పోస్టులు: 23
  • కంప్యూటర్ ఆపరేటర్‌ పోస్టులు: 2
  • క్యాటరింగ్ సూపర్‌వైజర్ పోస్టులు: 78
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు: 381
  • ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్టులు: 128
  • ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 161
  • మెస్ హెల్పర్ పోస్టులు: 442
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 19

ఆన్‌లైన్‌ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.