NCL Recruitment 2023: నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ 700 అప్రెంటిస్‌ ఖాళీలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు..

|

Jul 18, 2023 | 1:35 PM

బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన మధ్యప్రదేశ్‌లోని నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఎల్‌) 2023-24 విద్యాసంవత్సరానికి గాను 700 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌..

NCL Recruitment 2023: నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ 700 అప్రెంటిస్‌ ఖాళీలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు..
Northern Coalfields Limited
Follow us on

బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన మధ్యప్రదేశ్‌లోని నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఎల్‌) 2023-24 విద్యాసంవత్సరానికి గాను 700 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద గ్రాడ్యుయేట్‌/ డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు తప్పనిసరిగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

విభాగాలు..

మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఏడాదిపాటు కొనసాగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 3, 2023వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ. రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం షార్ట్‌ లిస్టింగ్‌ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.8000 నుంచి రూ.9000 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.