NEFR Recruitment 2022: స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగాలు.. మహిళ/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం..

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గువాహటిలోని నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా కింద.. అథ్లెటిక్స్, అర్చరీ, టెన్నిస్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్ క్రీడా విభాగాల్లో స్పోర్ట్స్ పర్సన్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి..

NEFR Recruitment 2022: స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగాలు.. మహిళ/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం..
Northeast Frontier Railway Recruitment 2022

Updated on: Oct 14, 2022 | 4:30 PM

భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గువాహటిలోని నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా కింద.. అథ్లెటిక్స్, అర్చరీ, టెన్నిస్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్ క్రీడా విభాగాల్లో 16 స్పోర్ట్స్ పర్సన్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ లేదా కౌన్సిల్‌ నుంచి ఇంటర్మీడియట్‌, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జనవరి 1, 2023వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 7, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అబ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలతోపాటు ట్రయల్ ఆఫ్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ, సంబంధిత క్రీడలో ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Sr. Personnel Officer (Recruitment), Northeast Frontier Railway HQ, Maligaon, Guwahati – 781 011 (Assam

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.