NIT Durgapur Technical Assocaite Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ టెక్నాలజీ.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ టెక్నికల్ అసోసియేట్, టెక్నికల్ అసోసియేట్ పోస్టుల (Technical Assocaite Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో రీసెర్చ్ అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగినవారు కింది ఈ మెయిల్ ఐడీకి తమ దరఖాస్తులను సెస్టెంబర్ 15, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ మెయిల్ ఐడీ: deanresearch@admin.nitdgp.ac.in
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.