కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన గురుగ్రామ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్‌ఐఎస్‌ఈ).. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / మెకానికల్ / రెన్యూవబుల్ ఎనర్జీ తదితర విభాగాల్లో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 3 నుంచి ఆరేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతతున్న అభ్యర్ధులు ,ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు (ఏప్రిల్ 30) కింది ఈమెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం అధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.53,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
recruitment.nise@nise.res.in
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.