NIMS Hyderabad Jobs: హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిన్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈ వైద్య సంస్థలో ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయో పోస్టులు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? లాంటి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో స్టడీ కోఆర్డినేటర్, స్టడీ నర్స్, ఫ్లెబొటోమిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎల్‌టీ డిప్లొమా/ డిగ్రీ, బీఎస్సీ, నర్సింగ్, ఎంఫార్మ్, ఫార్మ్ డి, బీడీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను డీన్స్ ఆఫీస్, నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్, 500082 అడ్రస్‌కు పంపించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,000 నుంచి రూ. 36,000 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 24-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Shocking Video: శునకమా మజాకా.. మీరు కూడా ఇంత ఫర్‌ఫెక్ట్‌గా సిగ్నల్స్ ఇవ్వరంతే..!