భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన రూర్కీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలజీ.. 12 సైంటిస్ట్ బీ, ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్‌లో సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలతోపాటు అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబర్ 30, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.2000లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించినవారికి కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పే స్కేల్ వివరాలు..
అడ్రస్: Senior Administrative Officer, National Institute of Hydrology, Jalvugyan Bhawan, Roorkee – 247667 (Uttarakhand), India.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.