NIB Recruitment 2023: ఇంటర్ అర్హతతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ (ఎన్‌ఐబీ).. అడ్మిన్, ఫైనాన్స్, ప్రొక్యూర్‌మెంట్, ఐటీ డివిజన్ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన 59 టెక్నికల్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్..

నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ (ఎన్‌ఐబీ).. అడ్మిన్, ఫైనాన్స్, ప్రొక్యూర్‌మెంట్, ఐటీ డివిజన్ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన 59 టెక్నికల్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) గ్రాడ్యుయేషన్ (సైన్స్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్ లేదా హిందీలో టైపింగ్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. పోస్టును బట్టి సంబంధిత పనిలో ఏడాది నుంచి పదేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు కింది ఈ మెయిల్ ఐడీకి ఏప్రిల్ 24, 2023వ తేదీలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఐడీ..
- rajdhanienterprises2007@gmail.com లేదా
- rajdhanienterprises338@gmail.com
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.




పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




