NHIT Recruitment 2023: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో కొలువులు.. అర్హతలు, అప్లికేషన్‌ వివరాలివే..

|

May 05, 2023 | 1:50 PM

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌ (ఎన్‌హెచ్‌ఐటీ).. 140 ప్రాజెక్ట్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, కోఆర్డినేటర్‌, మెయింటనెన్స్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌ తదితర పోస్టుల భర్తీకి..

NHIT Recruitment 2023: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో కొలువులు.. అర్హతలు, అప్లికేషన్‌ వివరాలివే..
NHIT
Follow us on

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌ (ఎన్‌హెచ్‌ఐటీ).. 140 ప్రాజెక్ట్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, కోఆర్డినేటర్‌, మెయింటనెన్స్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, ట్యాక్స్‌, ఆపరేషన్స్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా/ బీకామ్‌/ సీఏ/ ఎంకామ్‌/ ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 7, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధులు తమ రెజ్యూమ్‌ను career@nhit.co.in మెయిల్‌ ఐడీకి పంపించవల్సి ఉంటుంది. ఎంపిక విధానం, వయోపరిమితి, జీతభత్యాలు వంటి ఇతర పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.