NGRI Recruitment: నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థలో మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 07 ఖాళీలకుగాను జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (06), జూనియర్ స్టెనోగ్రాఫర్ (01) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తీర్ణత పాంది ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ మంచి నైపుణ్యం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
* జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తర్ణత పొంది ఉండాలి. కంప్యూటర్ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకు చెల్లిస్తారు.
* జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 13-09-2021న ప్రారంభంకాగా 15-10-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Exams postponed: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా!
Medical Devices Park: దేశంలో రూ.277 కోట్లతో వైద్య పరికరాల పార్కు.. 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు