NEET UG 2022: నీట్‌ యూజీ 2022 దరఖాస్తులకు నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న..

|

May 20, 2022 | 4:12 PM

నేషనల్‌ ఎటిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (NEET UG 2022) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు (మే 20)తో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే..

NEET UG 2022: నీట్‌ యూజీ 2022 దరఖాస్తులకు నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న..
Neet Ug 2022
Follow us on

NEET UG 2022 Application Last date: నేషనల్‌ ఎటిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (NEET UG 2022) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు (మే 20)తో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవల్సిందిగా నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) సూచించింది. ఈరోజు రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెల్పింది. అప్లికేషన్‌ ఫీజును రాత్రి 11 గంటల 50 నిముషాల వరకు చెల్లించవచ్చు. కాగా నీట్‌ యూజీ 2022 దరఖాస్తు ప్రక్రియ మే 15తో ముగియనుండగా.. విద్యార్ధుల అభ్యర్ధన మేరకు ఎన్టీఏ దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసింది. నీట్‌ యూజీ 2022 ప్రవేశ పరీక్ష జులై 17 (ఆదివారం)న దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ పద్దతిలో (పెన్‌-పేపర్‌) పలు పరీక్ష కేంద్రాల్లో 13 భాషల్లో జరగనుంది. ఈ పరీక్ష 200 ప్రశ్నలకు 200 నిముషాలపాటు కొనసాగుతుంది.

మరోవైపు నీట్ 2022 మెడికల్ ప్రవేశ పరీక్ష తేదీ ఇతర పోటీ పరీక్షలకు చాలా దగ్గరగా ఉన్నందున దానిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ 10,000 మందికి పైగా ఎంబీబీఎస్‌ ఆశావహ విద్యార్ధులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి లేఖ రాశారు. గత ఏడాదికి సంబంధించిన నీట్‌ 2021 కౌన్సెలింగ్ పూర్తి కాకుండానే, ఈ ఏడాది నీట్‌ 2022 తేదీని ఎన్టీఏ ప్రకటించింది. ఈ పరీక్షల ఆశావహులు చాలామంది నీట్‌ 2021 కౌన్సెలింగు తుదివరకూ (మాప్‌-అప్‌ రౌండు) మెడికల్‌ సీటు లభిస్తుందనే ఆశతో ఎదురుచూసి నిరాశకు గురయ్యారు. ఈ రౌండు ఏప్రిల్‌ మొదటివారంలో ముగిసింది.

కొన్ని రాష్ట్రాల్లో స్టేట్‌ కౌన్సెలింగు ఇప్పటికీ పూర్తి కాలేదు. అంతేకాకుండా నీట్‌ 2021 కౌన్సెలింగు నుంచి రిజర్వేషన్‌ విధానం మారటంతో ఈ ఏడాది చాలామంది విద్యార్థులు సీటు పొందేందుకు అనువైన పర్సంటేజీ గణాంకాలను కూడా సరిచూసుకోలేదు. అనేక రాష్ట్రాల్లో స్టేట్‌ కౌన్సెలింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ మొదటివారంలో కౌన్సెలింగు ముగియగానే.. ఆ తర్వాత 3 రోజులకు (ఏప్రిల్ 6న) జూలై 17 న నీట్ 2022న నిర్వహిస్తున్నట్లు ప్రకటించిందని విద్యార్థులు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనేక మంది డ్రాపర్లు, ఫ్రెషర్లకు నీట్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి తగినంత సమయం లేదని లేఖ ద్వారా అభ్యర్ధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.