JNV Result 2021: నవోదయ విద్యాలయ సమితి ఫలితాలు విడుదల.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

|

Sep 28, 2021 | 11:38 AM

JNV Result 2021: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాలలో 6, 11వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను 2021-2022 ఏడాదికి గాను..

JNV Result 2021: నవోదయ విద్యాలయ సమితి ఫలితాలు విడుదల.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే..
Follow us on

JNV Result 2021: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాలలో 6, 11వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను 2021-2022 ఏడాదికి గాను నిర్వహించారు. ఈ ఫలితాలను తాజాగా మంగళవారం విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌ అయిన navodaya.gov.in వెబ్‌సైట్లో ఫలితాలను చెక్‌ చేసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ ఏడాది జవహర్‌ నవోదయ విద్యాలయాల ఆరో తరగతి ప్రవేశ పరీక్షను ఆగస్టు 11, 2021లో నిర్వహించారు. ఈ పరీక్షను ఇంగ్లిష్‌, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అధికారులు పూర్తిగా కోవిడ్‌ -19 నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షలను చేపట్టారు. ఇక ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా మొత్తం 644 జిల్లాలో 11,152 సెంటర్లలో నిర్వహించారు. ఈ పరీక్షకు 14 లక్షల మంది హాజరుకాగా 47,320 మంది సెలక్ట్‌ అయ్యారు. ఇక 11వ తరగతి ప్రవేశ పరీక్షలో ఎంపికైన వారి జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఆరో తరగతి పరీక్ష ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ navodaya.gov.inలోకి వెళ్లాలి.

* అనంతరం ‘వ్యూ జేఎన్‌వీఎస్‌టీ క్లాస్‌ 6 రిజల్ట్స్‌’పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి సబ్‌మిట్ బటన్‌ నొక్కాలి.

* వెంటనే స్క్రీన్‌పై మీ ఫలితాలు వచ్చేస్తాయి.

Also Read: iral Video: వారెవ్వా.. ఈ రైతు తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. అసలు ఏం చేస్తున్నాడో చూడండి…

Viral Video: అందరినీ హడలెత్తించిన లేడీ దెయ్యం.. అతను ఇచ్చిన ట్విస్ట్‌కు బిత్తరపోయింది.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..

Lata Mangeshkar Birthday: 91వ జన్మదినాన్ని జరుపుకుంటున్న గానకోకిల లతా మంగేష్కర్.. జీవితంలో కొన్ని ముఖ్య విషయాలు