NHIT Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.

|

May 02, 2023 | 7:17 PM

నేషనల్ హైవేస్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న 140 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

NHIT Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Nhit Recruitment
Follow us on

నేషనల్ హైవేస్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న 140 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 140 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, కోఆర్డినేటర్‌, మెయింటనెన్స్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, ట్యాక్స్‌, ఆపరేషన్స్‌ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా/ బీకామ్‌/ సీఏ/ ఎంకామ్‌/ ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌, ఈమెయిల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేన్న తర్వాత అప్లికేషన్‌ను ఈమెయిల్‌ ద్వారా పంపించాలి.

* దరఖాస్తులను careers@nhit.co.in మెయిల్ ఐడీకి పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు 07-05-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..