Hiring Trends 2021: కరోనా కారణంగా ఉద్యోగాల నియామకంపై తీవ్ర ప్రభావం పడింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో కరోనా ప్రభావం తగ్గుతున్న తరుణంలో ఉద్యోగ నియామకాల తీరు ఎలా ఉండనుంది. రానున్న రోజుల్లో రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి. లాంటి వివరాలను కేపీఎమ్‌జీ, నేషనల్ లీడర్ – ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ నారాయణ్ రామస్వామీ పంచుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ్ ఏమన్నారంటే..
2021లో ఉద్యోగనియామకాలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైంది గతేడాది కరోనా కారణంగా పూర్తి స్థాయిలో నియామకాలు జరగలేవు. కరోనా కారణంగా పరిస్థితులు ఎలా ఉంటాయోనని కంపెనీలు అభ్యర్థులను తీసుకోలేదు. దీంతో ఈ ఏడాది కొత్త ప్రాజెక్టుల రాకతో ఒక్కసారిగా అభ్యర్థుల అవసరం వచ్చింది. దీంతో కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను పెంచేశాయి.
అనుభం ఉన్న వారు కూడా రానున్న రోజుల్లో మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా పనిచేయని పరిస్థితుల ఉన్నాయి. కానీ ఈ ఏడాది విద్యను పూర్తి చేసుకున్న వారు ఇందులో సరిగ్గా సరిపోతారు. ఫ్రెషర్స్‌ను తక్కువ జీతానికి తీసుకొని వారికి అవసరమైన శిక్షణ ఇవ్వొచ్చు. ఈ కారణంగా కంపెనీలు ఫ్రెషర్స్‌ని తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. ప్రతిభ ఉన్న యువకులవైపు కంపెనీలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. తమకు తాము కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటోన్న యువతే నేడు మార్కెట్‌కు అవసరం. ఇతర ప్లాట్‌ఫామ్‌లకు అవసరమయ్యే టెక్నాలజీలను నేర్చుకునే వారికే భవిష్యత్తులో ఉద్యోగాలు లభిస్తాయి.
క్యాంపస్‌లు మాత్రమే విద్యార్థులను ఉద్యోగానికి సన్నద్ధం చేయగలుగుతాయి. కానీ ఇండియాలో చాలా వరకు అలాంటి పరిస్థితులు కనిపించడంలేదు. దాదాపు 90 శాతం మంది విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసమే యూనివర్సిటీల్లో చేరుతున్నారు. విద్యార్థులు కేవలం మంచి ఉద్యోగం కోసమే మంచి విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వాలు గనుక ఉద్యోగానికి డిగ్రీలు అవసరం లేదని ప్రకటిస్తే చాలా మంది యూనివర్సిటీలకు వెళ్లడం మానేస్తారనేది నా అభిప్రాయం. విద్యార్థులకు మరో అవకాశం లేదు కాబట్టే యూనివర్సిటీల్లో చదువుతున్నారు.
ఇందులో మనం ఇప్పుడే ప్రయాణాన్ని ప్రారంభించాం. నిజానికి 2009 వరకు మనం వొకేషనల్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మనం ఇప్పుడే ఈ మార్గంలో ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఇది పూర్తి ఫలితాలను ఇవ్వాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పటి వరకు నైపుణ్యాలను పెంపొందించే మన సంస్థల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్స్‌లు 35 శాతం వద్ద ఆగిపోవడానికి కారణాలు ఏంటి? కాబట్టి మనం ఉద్యోగాలకు అవసరమయ్యే విద్యను అందించడం లేదని స్పష్టమవుతోంది. కానీ ఆ దిశగా ప్రయాణిస్తున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: AP: కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులందరికీ ఉచిత విద్య.. ఏపీ సర్కారు సత్వర చర్యలు
Guntur District: ఊహించని విషాదం.. వెంటాడిన తేనెటీగలు.. గుండెపోటుతో వ్యక్తి మృతి
Afghanistan crisis: ఆ విమానంలో నుంచి కింద పడిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు!