AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ ఇదే.. అక్టోబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్లు

దేశవ్యాప్తంగా వైద్య పీజీ (MD/MS) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే NEET PG 2026 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను MCC విడుదల చేసింది. రౌండ్‌-1 రిజిస్ట్రేషన్లు అక్టోబర్‌ 12 నుంచి ప్రారంభం కానుండగా.. అక్టోబర్‌ 13 నుంచి ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబర్‌ 24న తొలి విడత సీట్‌ అలాట్‌మెంట్‌ ఫలితాలు వెల్లడించనున్నారు. అభ్యర్థులు ముందుగానే అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని MCC సూచించింది..

NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ ఇదే.. అక్టోబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్లు
NEET PG Counselling
Srilakshmi C
|

Updated on: Oct 08, 2026 | 6:25 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 8: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పీజీ (MD/MS) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET PG 2026 కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) విడుదల చేసింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్లతో పాటు డీమ్డ్/డీఎండీ యూనివర్సిటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) సంస్థల్లోని పీజీ సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్‌లో తొలి విడత (Round-1) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 అక్టోబర్ 12న ప్రారంభం కానుంది. NEET PG 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు MCC అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

అక్టోబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్లు

MCC విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 12న రౌండ్-1 కౌన్సెలింగ్‌ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమకు కావాల్సిన కాలేజీలు, కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. అక్టోబర్ 13 నుంచి Choice Filling ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది. అభ్యర్థులు తమ ప్రాధాన్యత క్రమంలో కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలి. సీట్ల కేటాయింపులో అభ్యర్థి ర్యాంకు, అందుబాటులో ఉన్న సీట్లు, కేటగిరీ, అభ్యర్థి ఎంచుకున్న ఆప్షన్లు తదితర అంశాలు కీలకంగా ఉంటాయి.

అక్టోబర్ 24న సీట్ల కేటాయింపు ఫలితాలు

రౌండ్-1లో రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 24, 2026న తొలి విడత సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు వెల్లడించనున్నారు. సీటు కేటాయింపు అనంతరం అభ్యర్థులు MCC సూచించిన విధంగా తదుపరి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు కేటాయించిన కాలేజీలో అడ్మిషన్‌కు సంబంధించిన గడువులు, అవసరమైన పత్రాలు, రిపోర్టింగ్‌ నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి. రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యేలోపే అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికేట్‌, NEET PGకు సంబంధించిన పత్రాలు, గుర్తింపు పత్రాలు తదితర అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన తాజా మార్గదర్శకాలు, సీట్ల వివరాలు, రిజిస్ట్రేషన్‌ విధానం, ఫీజు తదితర అంశాల కోసం అభ్యర్థులు MCC అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసే నోటిఫికేషన్లను పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

NEET PG 2026 Counselling ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: అక్టోబర్ 12, 2026.
  • Choice Filling ప్రారంభ తేదీ: అక్టోబర్ 13, 2026.
  • రౌండ్-1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు విడుదల తేదీ: అక్టోబర్ 24, 2026.

NEET PG కౌన్సెలింగ్‌లో కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసుకునే సమయంలో అభ్యర్థులు తమ ర్యాంకు, కేటగిరీ, గత కౌన్సెలింగ్ ట్రెండ్స్‌, అందుబాటులో ఉన్న సీట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా Choice Fillingను తొందరపడి కాకుండా ప్రాధాన్యత క్రమంలో జాగ్రత్తగా నమోదు చేయడం ముఖ్యం.

Follow Us
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం
బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్..
బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్..
10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి..
10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి..
మరి కొద్దీ రోజుల్లో ఈ రాశుల లైఫ్ లో వీళ్ళు కూడా ఊహించని మార్పులు
మరి కొద్దీ రోజుల్లో ఈ రాశుల లైఫ్ లో వీళ్ళు కూడా ఊహించని మార్పులు