No Exams: పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్.. ఆలోచిస్తోన్న ప్రభుత్వం.. రెండో రోజుల్లో అధికారిక నిర్ణయం..
Promote Without Exams: కరోనా కారణంగా తీవ్ర ప్రభావం పడిన రంగాల్లో విద్యా రంగం ఒకటి. ముఖ్యంగా గతేడాది విద్యార్థులు కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు పాఠశాలలు మూతపడడం, మరో వైపు పరీక్షలు..
Promote Without Exams: కరోనా కారణంగా తీవ్ర ప్రభావం పడిన రంగాల్లో విద్యా రంగం ఒకటి. ముఖ్యంగా గతేడాది విద్యార్థులు కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు పాఠశాలలు మూతపడడం, మరో వైపు పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో మానసికంగా కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే గతేడాది తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసింది. అయితే ఈసారి కూడా ఇలాంటి పరిస్థితులే రానున్నాయా అంటే.. మన దగ్గర ఏమో కానీ, మహారాష్ట్రలో మాత్రం రానున్నాయనే సమాధానం వస్తోంది.
తాజాగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం 9, 11వ తరగతి విద్యార్థులను పరీక్షలకు లేకుండా ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్నల్ మార్క్‌ల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. దీనిపై విద్యాశాఖ మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ విషయమై మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి అధికారులతో చర్చించారని, ఈ నేపథ్యంలో పరీక్షల రద్దుపై మాట్లాడారని వినికిడి. అయితే పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ.. అందరికీ కంప్యూటర్‌లు అందుబాటులో లేవని, ఒకవేళ అందరికీ కంప్యూటర్‌లు అందించిన.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండదనే వాదన కూడా వచ్చిందని తెలుస్తోంది. మరి పరీక్షల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: Viral Video: కన్నడ నాట వెలుగులోకి మరో రాసలీల వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
RBI: పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. డిపాజిట్ పరిమితిని ఆర్‌బీఐ ఎంత పెంచిందంటే..?