Top Colleges in Hyderabad: హైదరాబాద్‌లో టాప్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇవే.. టాప్ 1 కాలేజీ ఏదంటే!

తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దోస్త్ డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరోవైపు ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, లాసెట్‌ వంటి పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని టాప్ డిగ్రీ కాలేజీల కోసం గాలిస్తున్నారు. ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్..

Top Colleges in Hyderabad: హైదరాబాద్‌లో టాప్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇవే.. టాప్ 1 కాలేజీ ఏదంటే!
Top Degree Colleges In Hyderabad

Updated on: May 30, 2024 | 5:50 PM

హైదరాబాద్‌, మే 30: తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దోస్త్ డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరోవైపు ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, లాసెట్‌ వంటి పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని టాప్ డిగ్రీ కాలేజీల కోసం గాలిస్తున్నారు. ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్‌లో హైదరాబాద్‌లోని రెండు డిగ్రీ కాలేజీలను దేశంలోని టాప్ 200 ఇన్‌స్టిట్యూషన్‌లలో ఒకటిగా నిలిచాయి. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ హైదరాబాదులోని టాప్ డిగ్రీ కాలేజీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని టాప్ 100 విద్యా సంస్థల్లో హైదరాబాద్‌కు చెందిన ఏకైక కాలేజీ ఇదే. ఇక రెండొవది లోయాలా అకాడమీ. టాప్‌ 200 ఇండిచపఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ రెండు డిగ్రీ కాలేజీలు హైదరాబాద్‌లోని టాప్ కేటగిరీలో నిలిచాయి.

హైదరాబాద్‌లో టాప్‌ ఇంజనీరింగ్ కాలేజీలు

డిగ్రీ కాలేజీలతో పాటు హైదరాబాద్‌లోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల జాబితాను కూడా ఎన్‌ఐఆర్‌ఎఫ్ విడుదల చేసింది. నగరంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ- హైదరాబాద్) మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో 100లోపున్న టాప్‌ ఇంజనీరింగ్ కాలేజీల్లో హైదరాబాద్‌లో ఉన్నవి ఇవే..

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్- టాప్‌ 8
  • ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్- టాప్‌ 55
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ – టాప్‌ 71
  • జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ – టాప్‌ 83

పై ఇంజనీరింగ్ కాలేజీలే కాకుండా ఈ కింది ఇన్‌స్టిట్యూట్‌లు కూడా హైదరాబాద్‌లో చాలా ఫేమస్‌. అవేంటంటే..

ఇవి కూడా చదవండి
  • అనురాగ్ యూనివర్సిటీ
  • గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్‌ టెక్నాలజీ
  • యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
  • వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
  • చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్
  • మహీంద్రా యూనివర్సిటీ
  • మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.