Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoffs: గూగుల్‌ సీఈఓకు తగిలిన లేఆఫ్స్‌ సెగ.. సుందర్ పిచాయ్‌ జీతంలో భారీగా కోత.

ప్రస్తుతం ప్రపంచమంతా లేఆఫ్స్‌ భయంతో ఉంది. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న చిన్న స్టార్టప్‌ల మొదలు ప్రపంచ ఐటీ దిగ్గజాలు సైతం ఉద్యోగులను తొలగిస్తుండడం అందరినీ కలవరపాటుకు..

Layoffs: గూగుల్‌ సీఈఓకు తగిలిన లేఆఫ్స్‌ సెగ.. సుందర్ పిచాయ్‌ జీతంలో భారీగా కోత.
Sundar Pichai
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 29, 2023 | 4:50 PM

ప్రస్తుతం ప్రపంచమంతా లేఆఫ్స్‌ భయంతో ఉంది. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న చిన్న స్టార్టప్‌ల మొదలు ప్రపంచ ఐటీ దిగ్గజాలు సైతం ఉద్యోగులను తొలగిస్తుండడం అందరినీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితులు వచ్చాయి. ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌ అయితే ఏకంగా ఒకేసారి 12 వేల మందిని తొలగించి ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. ఇదిలా ఉంటే గూగుల్ ఉద్యోగులను ఇంటికి పంపడానికే పరిమితం కాలేదు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలు పెట్టేందుకు సిద్ధమైంది. మేనేజర్ స్థాయిలో ఉన్న ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలు తప్పవని ఇప్పటికే ఇండికేషన్స్‌ ఇస్తోంది.

ఈ నేపథ్యంలో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన జీతాన్ని కూడా భారీగా తగ్గించున్నారని టాక్‌. ఉద్యోగులతో టౌన్ హాల్ సమావేశంలో, పిచాయ్ సీనియర్‌ ఉద్యోగుల వేతన కోత విషయాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నుంచి పైనున్న పలువురి టాప్‌ ఉద్యోగుల జీతాల్లో భారీగానే కోత పడనుంది. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బోనస్‌ను తగ్గించడంతోపాటు ఇకపై సీనియర్ ఉద్యోగులందరికీ పని తీరు ఆధారంగానే వార్షిక బోనస్ ఉంటుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు సీఈవోగా తన వేతనంలో కోత విధించుకున్నట్టు తెలుస్తోంది. అయితే వారి వారి జీతాలు ఎంత శాతం తగ్తుతాయి, ఈ కోతలు ఎంతకాలం ఉంటాయనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే ఐఐఎఫ్‌ఎల్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022 ప్రకారం సుందర్‌ పిచయ్‌ 2 మిలియన్ల డాలర్లు జీతంగా తీసుకుంటున్నట్లు సమాచారం. వీటితో పాటు కంపెనీ షేర్లు అదనం. అయితే ఇంత మంది ఉద్యోగులను తొలగించే బదులు సీఈవోగా ఆయన జీతంలో కోత విధించు కోవచ్చుగా కదా ప్రశ్నలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుందర్‌ పిచాయ్‌ తన జీతాన్ని తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..