AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KVS Admission Results 2026: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల 2026 ఫలితాలు విడుదల.. సెలక్షన్‌ లిస్ట్‌ లింక్ ఇదే

దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలవాటిక ప్రవేశాల ఫలితాలను బుధవారం (ఏప్రిల్ 8) విడుదల చేసింది. కేంద్రీయ విద్యాలయల్లో బాలవాటిక ప్రవేశాల లాటరీ ఫలితాలను ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. అలాగే 1, 2, 3 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధుల..

KVS Admission Results 2026: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల 2026 ఫలితాలు విడుదల.. సెలక్షన్‌ లిస్ట్‌ లింక్ ఇదే
KVS Admission Results
Srilakshmi C
|

Updated on: Apr 08, 2026 | 5:08 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలవాటిక ప్రవేశాల ఫలితాలను బుధవారం (ఏప్రిల్ 8) విడుదల చేసింది. కేంద్రీయ విద్యాలయల్లో బాలవాటిక ప్రవేశాల లాటరీ ఫలితాలను ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. అలాగే 1, 2, 3 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధుల ఫలితాలను కూడా కేవీస్‌ రేపు విడుదల చేసింది. ఫలితాలను అధికారిక KVS పోర్టల్స్‌లో చెక్‌ చేసుకోవచ్చు. కేవీఎస్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన తొలి విడత ఫలితాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ కూడా త్వరలనే ప్రారంభించనుంది. తాత్కాలిక ఎంపిక జాబితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ అడ్మిషన్ స్థితిని ఈ కింది విధానం ద్వారా చెక్‌ చేసుకోండి..

కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక, 1వ, 2వ, 3వ తరగతి ప్రవేశాల 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేదా

ఇవి కూడా చదవండి

కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక, 1వ, 2వ, 3వ తరగతి ప్రవేశాల 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల 2026 ఫలితాలను ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా విద్యార్ధుల తల్లిదండ్రులు KVS అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి.
  • హోమ్‌పేజీలో ఉన్న అడ్మిషన్స్ 2026-27 ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • బాలవతిక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 2026 లేదా లాటరీ రిజల్ట్ 2026 అనే లింక్‌ను ఎంచుకోవాలి.
  • డ్రాప్‌డౌన్ మెనూలో మీ రాష్ట్రం, KV ప్రాంతం, పాఠశాల పేరును ఎంచుకోవాలి.
  • అనంతరం స్క్రీన్‌ఫై రిజల్ట్స్ పీడీఎఫ్ ఫైల్‌ తెరుచుకుంటుంది. ఇందులో మీ పిల్లల రిజిస్ట్రేషన్ నంబర్‌ను కనుగొనడానికి సెర్చ్ ఫంక్షన్
  • (Ctrl+F) ఉపయోగించవచ్చు.

ఇక కేవీఎస్ ఒకటో, రెండో, మూడో తరగతికి సంబంధించిన మొదటి తాత్కాలిక జాబితాను గురువారం (ఏప్రిల్ 9, 2026న) విడుదల చేయనుంది. అయితే ప్రస్తుతం ఓట్ల పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో మాత్రం ఒకటవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు కేవీఎస్‌ అధికారులు తెలిపారు. మొదటి జాబితాలో తమ పిల్లల పేరు కనిపించని తల్లిదండ్రులు నిరాశ చెందవల్సిన అవసరం లేదు. మొదటి విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం ఖాళీగా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి కేవీఎస్ రెండో, మూడో ఎంపిక జాబితాలను కూడా విడుదల చేస్తుంది. రెండో జాబితా ఏప్రిల్ 16, మూడో జాబితా ఏప్రిల్ 21 తేదీలలో విడుదలవుతాయి. ఆర్టీఈ (RTE), సర్వీస్ ప్రయారిటీ (రక్షణ/కేంద్ర ప్రభుత్వం), రిజర్వేషన్ కోటాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవీఎస్ బాలవాటిక ఎంపిక జాబితాలో పిల్లల పేర్లు ఉన్న తల్లిదండ్రులు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 20, 2026 మధ్య ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరుకావల్సి ఉంటుంది. గడువులోగా హాజరుకాకపోతే తమకు కేటాయించిన సీటు రద్దు చేసి, తదుపరి వెయిటింగ్‌ లిస్ట్‌లోఉన్న విద్యార్ధికి కేటాయిస్తారు.

కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక, 1వ, 2వ, 3వ తరగతి ప్రవేశాల 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేదా

కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక, 1వ, 2వ, 3వ తరగతి ప్రవేశాల 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవసరమైన పత్రాలు ఇవే..

  • జనన ధృవీకరణ పత్రం
  • నివాస రుజువు (ఆధార్/ఓటర్ ఐడి/రేషన్ కార్డు)
  • కుల ధృవీకరణ పత్రం (Caster Certificate)
  • సర్వీస్ ప్రయారిటీ సర్టిఫికెట్
  • ఆదాయ ధృవీకరణ పత్రం (RTE కోటా)

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us