MBBS, BDS Admissions: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కాలోజీ వర్సిటీ నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

|

Aug 06, 2024 | 11:52 AM

తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు సంబంధించి ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ కింద యూనివర్సిటీ పరిధిలోని ఎంబీబీఎస్‌, డెంటల్‌ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు..

MBBS, BDS Admissions: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కాలోజీ వర్సిటీ నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే
MBBS, BDS Admissions
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు సంబంధించి ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ కింద యూనివర్సిటీ పరిధిలోని ఎంబీబీఎస్‌, డెంటల్‌ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్‌ యూజీ 2024 అర్హత పరీక్షలో అర్హత సాధించిన రాష్ట్ర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్ధులు ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ధృవ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

పీజీ డెంటల్‌ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌-ఎండీఎస్‌ 2024 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఎండీఎస్‌ కోర్సులో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. నీట్ఎండీఎస్‌ పరీక్షలో కట్ ఆఫ్‌ స్కోర్‌ కూడా ప్రకటించారు.

జనరల్‌ కేటగిరిలో 800లకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరిలో 40 శాతం, దివ్యాంగులకు 45 శాతంగా కటాఫ్‌ నిర్ణయించారు. కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నీట్ఎండీఎస్‌ పరీక్షలో అర్హతతోపాటు తెలంగాణలోని డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా గుర్తించిన బీడీఎస్‌ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇతర పూర్తి వివరాలకు 93926 85856, 90596 72216 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించింది. లేదంటే tspgmed2024@gmail.comకు మెయిల్‌ చేయాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.