KIOCL Recruitment: ఇంజనీర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్‌.. నెలకు రూ. లక్షకుపైగా జీతం..

KIOCL Recruitment: ఇంజనీర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించే లక్కీ ఛాన్స్‌. బెంగళూరులోని కేఐవోసీఎల్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పలు విభాగాల్లో ఉన్న...

Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 05, 2022 | 6:15 AM

KIOCL Recruitment: ఇంజనీర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించే లక్కీ ఛాన్స్‌. బెంగళూరులోని కేఐవోసీఎల్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పలు విభాగాల్లో ఉన్న గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 35 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా గేట్‌ 2021/2022 వ్యాలిడ్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్‌ ఫామ్‌ హార్డ్‌ కాపీని అందించాలి.

* ఎంపికైన వారికి నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు జీతంగా అందిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 24-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* అప్లికేషన్‌ ఫామ్‌ హార్డ్‌ కాపీని 30-09-2022లోపు సమర్పించాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..