KIOCL Limited Graduate Engineer Trainee Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (KIOCL Limited).. 35 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (Graduate Engineer Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్ 2021/2022లో వ్యాలిడ్ స్కోర్ సాధించి ఉండాలి. జులై 31, 2022వ తేదీ నాటికి 27 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్ 24, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు:
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.