బెంగళూరులోని కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (కేఐవోసీఎల్).. 17 చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మైనింగ్, ఫైనాన్స్, మెటీరియల్, కమర్షియల్, ఎలక్ట్రికల్, ట్రైనింగ్ అండ్ సేఫ్టీ, జియాలజీ, స్ట్రక్చరల్, సర్వే విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీజీ లేదా తత్సమాన కోర్సులో త్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అక్టోబర్ 31, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 30 యేళ్ల నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 3, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు డిసెంబర్ 9వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.500లు దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైనవారికి పోస్టును బట్టి రూ.50,000ల నుంచి రూ.2,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.