దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్, ఇతర పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్ణయించింది. 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ పరీక్షలు జరుగుతాయి. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు – 52 ఉండగా.. వీటికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిబ్రవరి 7న జరగనుంది. 239 ప్రిన్సిపల్ పోస్టులకు ఫిబ్రవరి 8, 203 వైస్ ప్రిన్సిపల్ పోస్టులు, పీఆర్‌టీ మ్యూజిక్-233 పోస్టులకు ఫిబ్రవరి 9న, 3,176 టీజీటీ పోస్టులకు ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు, 1,409 పీజీటీ పోస్టులకు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి.
6 ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, 2 ఏఈ సివిల్ పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్ -11 ఉద్యోగాలకు ఫిబ్రవరి 20న, 6,414 పీఆర్‌టీ ఉద్యోగాలకు ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు పరీక్షలు ఉంటాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల(702)కు మార్చి 1 నుంచి 5 వరకు; స్టెనోగ్రాఫర్ గ్రేడ్- 2 (54) ఉద్యోగాలకు మార్చి 5; లైబ్రేరియన్ (355), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(156), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(322) ఉద్యోగాలకు మార్చి 6న పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటనలో వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితర అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 5న మొదలైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 2తో ముగిసింది. కాగా.. పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలో జారీ చేయనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.