
హైదరాబాద్, మే 29: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల జోసా కౌన్సెలింగ్ జరగనుంది. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్ తెలిపింది. తాజాగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)-2025 వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది కూడా. గత ఏడాది వరకు ఐదు రౌండ్ల కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించేవారు. ఈసారి పోటీ రిత్య ఆరు రౌండ్లు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. జూన్ 2వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు రానున్నాయి. ఆ మరుసటి రోజు సాయంత్రం నుంచే అంటే జూన్ 3వ తేదీ నుంచి జోసా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి.
జూన్ 3 నుంచి 11వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా రెండు సార్లు మాక్ సీట్ ఎలాట్‌మెంట్ నిర్వహించనున్నారు. మాక్ సీట్ అలాట్‌మెంట్ ఆధారంగా తమ ర్యాంకు ప్రకారం ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులు అవగాహన ఉంటుంది. మొదటి మాక్ సీట్ కేటాయింపు జాబితా జూన్ 9న, రెండవ మాక్ సీట్ కేటాయింపు జాబితా జూన్ 11న ఉంటుంది. JoSAA 2025 కింద అకాడెమిక్ ప్రోగ్రామ్‌లకు అభ్యర్థుల నమోదు, ఆప్షన్ల ప్రక్రియ జూన్ 12తో ముగియనుంది. కాగా జోసా 2025 కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది మొత్తం 127 విద్యా సంస్థలు పాల్గొననున్నాయి. గత ఏడాది కంటే ఈసారి నాలుగు సంస్థలు అధికంగా ఉన్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.