
హైదరాబాద్, జూన్ 14: దేశంలోని 23 ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను తాజాగా విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ JEE Main అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ద్వారా లాగిన్ అయి తమకు కేటాయించిన కళాశాల, కోర్సు వివరాలను తెలుసుకోవచ్చు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు అందరూ జూన్ 26 వరకు ఆన్‌లైన్ రిపోర్టింగ్, డాక్యుమెంట్ అప్‌లోడ్, ధ్రువీకరణ, సీటు అంగీకార రుసుము చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. జులై 21తో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తికానుంది.
జోసా తొలి విడత సీట్ల కేటాయింపు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జోసా తొలి విడత సీట్ల కేటాయింపు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఏడాది కూడా JEE Advanced టాప్ ర్యాంకర్లను ఆకర్షించడంలో IIT Bombay, IIT Delhi, IIT Madras మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా B.Tech Computer Science and Engineering (CSE) కోర్సుకు భారీ డిమాండ్ కనిపించింది. IIT Bombayలో Open Gender-Neutral విభాగంలోని 61 CSE సీట్లు 1 నుంచి 65 ర్యాంకుల మధ్య ఉన్న అభ్యర్థులతోనే భర్తీ అయ్యాయి. దీంతో దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న కోర్సుగా మరోసారి IIT Bombay CSE నిలిచింది. IIT Delhi, IIT Madrasల్లో కూడా వరుసగా 30, 27 Open Gender-Neutral CSE సీట్లు టాప్ ర్యాంకర్లతో నిండిపోయాయి. ఈ ఏడాది తొలిసారిగా JoSAA కౌన్సెలింగ్‌లో భాగమైన IISc Bengaluru కూడా ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించింది. సీఎస్‌ఈ కోర్సు లేకపోయినా అక్కడ అందుబాటులో ఉన్న 125 సీట్లకు మంచి డిమాండ్ నమోదైంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ విద్యాసంస్థల్లో IIT Hyderabad మరోసారి ఆకర్షణగా నిలిచింది. గత ఏడాది తొలి విడతలో IIT Hyderabad CSEలో Open Gender-Neutral విభాగంలో 339 నుంచి 667 ర్యాంకుల మధ్య ప్రవేశాలు ముగియగా, ఈసారి 339 నుంచి 647 ర్యాంకులకే సీట్లు పూర్తయ్యాయి. దీంతో కోర్సుపై డిమాండ్ మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. CSE తర్వాత అత్యధిక డిమాండ్ ఉన్న Artificial Intelligence (AI) కోర్సు మెరిసింది. ఈ కోర్సులో ప్రారంభ, ముగింపు ర్యాంకులు 696 నుంచి 906గా నమోదయ్యాయి. Computation Engineeringలో 1605 నుంచి 1917 ర్యాంకుల మధ్య ప్రవేశాలు జరిగాయి. IIT Tirupatiలో Computer Science తర్వాత అత్యధికంగా విద్యార్థులు Electrical Engineering కోర్సును ఎంపిక చేసుకున్నారు. NIT Warangalలో CSE కోర్సుకు కూడా మంచి డిమాండ్ కొనసాగుతోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఈ ఏడాది కూడా Computer Science and Engineering కోర్సులకు అత్యధిక డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా IIT Bombay, IIT Delhi, IIT Madras, IIT Hyderabad వంటి ప్రముఖ సంస్థల్లో టాప్ ర్యాంకర్ల తొలి ఎంపికగా ఈ కోర్సులు నిలిచాయి.
జోసా తొలి విడత సీట్ల కేటాయింపు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.