JNTU Hyderabad Exams: వాయిదా పడిన ఫార్మసీ పరీక్షలపై JNTU క్లారిటీ.. ఇంతకీ సంగతేమంటే?
ష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు సమ్మె కారణంగా ఇటీవల పలు పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో రెండు బీఫార్మసీ పరీక్షలను జేఎన్టీయూహెచ్ త్వరలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 4, 6 తేదీల్లో బీ-ఫార్మసీలోని అనాటమీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ పరీక్షలను విశ్వవిద్యా లయం నిర్వహించింది. అయితే..

హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు సమ్మె కారణంగా ఇటీవల పలు పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో రెండు బీఫార్మసీ పరీక్షలను జేఎన్టీయూహెచ్ త్వరలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 4, 6 తేదీల్లో బీ-ఫార్మసీలోని అనాటమీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ పరీక్షలను విశ్వవిద్యా లయం నిర్వహించింది. అయితే అప్పట్లో సమ్మె కారణంగా దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయలేకపోయారు. సమ్మె సమయంలో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇవ్వడంతో నవంబర్ 8 నుంచి కాలేజీలు తిరిగి తెరుచుకున్నాయి.
ఈ క్రమంలో ఉన్నత విద్యా కళాశాలల సమాఖ్య (పతి) నేతలు, ఫార్మసీ కళాశాలల ప్రతిని ధులు ఇటీవల సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేనను కలిశారు. తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆమెకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఐబీపీఎస్ క్లర్క్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే?
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. దేశ వ్యాప్తంగా మొత్తం 13,533 క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐబీపీఎస్ ప్రకటన జారీ చేసింది. కాగా ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ లేదా రోల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింది వెబ్‌సైట్ లింక్‌లో చెక్ చేసుకోండి.
ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




