TG TET 2026 Result Date: టెట్ రాత పరీక్షలు, ఫలితాల తేదీలు వచ్చేశాయ్.. అర్హత మార్కులు చూశారా?
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ (టెట్ 2026) నోటిఫికేషన్‌ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 15వ తేదీ నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనాయి. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 29, 2025వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక టెట్ పరీక్షల తేదీలను కూడా..

హైదరాబాద్, నవంబర్ 16: ఈ ఏడాదికి తుది విడత తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ (టెట్ 2026) నోటిఫికేషన్‌ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 15వ తేదీ నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనాయి. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 29, 2025వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక టెట్ పరీక్షల తేదీలను కూడా విద్యాశాఖ తాజాగా వెల్లడించింది.
వచ్చే ఏడాది జనవరిలో ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న తెలిపింది. ఇక టెట్ ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీల మధ్య వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇక టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అందులో పేర్కొంది.
కేటగిరీల వారీగా అర్హత మార్కులు ఇవే..
కేటగిరీల వారీగా టెట్ అర్హత మార్కులను కూడా విద్యాశాఖ వెల్లడించింది. ఈసారి కొత్తగా ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తీసుకొచ్చారు. ఇప్పటివరకు జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు మాత్రమే ఉండేవి. ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ జనరల్ కేటగిరీ మాదిరిగానే 60 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. వీరికి కూడా 60 శాతం మార్కులు, ఆపైన వస్తేనే ఉత్తీర్ణులవుతారన్నమాట. అంటే టెట్‌లో వీరంతా 150కి 90 మార్కులు తప్పనిసరిగా తెచ్చుకోవల్సి ఉంటుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ టెట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో సైతం అర్హత మార్కులను ఇదే విధంగా మార్పు చేశారు.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




