AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Govt Jobs 2025: పోలీస్‌ శాఖలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే జాబ్‌ మీదే

TG Forensic Science Laboratory jobs 2025: రాష్ట్ర పోలీస్ శాఖలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (TG FSL) లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ విభాగాల్లో మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా..

TS Govt Jobs 2025: పోలీస్‌ శాఖలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే జాబ్‌ మీదే
Telangana Forensic Science Laboratory Jobs
Srilakshmi C
|

Updated on: Nov 16, 2025 | 1:50 PM

Share

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB).. మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (TG FSL) లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ విభాగాల్లో మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 27, 2025వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • సైంటిఫిక్ ఆఫీసర్‌ పోస్టులు మొత్తం 10 వరకు ఉన్నాయి ఇందులో.. సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజికల్/జనరల్‌) పోస్టులు: 2 సైంటిఫిక్ ఆఫీసర్ (కెమికల్‌) పోస్టులు: 3 సైంటిఫిక్ ఆఫీసర్ (బయోలజీ/సెరాలజీ) పోస్టులు: 3 సైంటిఫిక్ ఆఫీసర్ (కంప్యూటర్స్‌) పోస్టులు: 2
  • సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 32 ఇందులో.. సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్/జనరల్‌) పోస్టులు: 5 సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్‌) పోస్టులు: 10 సైంటిఫిక్ అసిస్టెంట్ (బయోలజీ/సెరాలజీ) పోస్టులు: 10 సైంటిఫిక్ అసిస్టెంట్ (కంప్యూటర్స్‌) పోస్టులు: 7
ఇవి కూడా చదవండి
  • ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 17 ఇందులో.. ల్యాబ్ టెక్నీషియన్ (ఫిజికల్/జనరల్‌) పోస్టులు: 2 ల్యాబ్ టెక్నీషియన్ (కెమికల్‌) పోస్టులు: 6 ల్యాబ్ టెక్నీషియన్ (బయోలజీ/సెరాలజీ) పోస్టులు: 4 ల్యాబ్ టెక్నీషియన్ (కంప్యూటర్స్‌) పోస్టులు: 5
  • ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు: 1

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ/బైపీసీ, ఎంఏ/బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంటెక్‌/ఎంసీఏ/బీఎస్సీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌సర్విస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 15, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద సైంటిఫిక్ ఆఫీసర్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.2,000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాలి. ల్యాబ్ టెక్నీషియన్‌ పోస్టులకు జనరల్‌ అభ్యర్ధులు రూ.1200, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులు రూ.600 చెల్లించాలి.ల్యాబ్ అటెండెంట్‌ పోస్టులకు జనరల్‌ అభ్యర్ధులు రూ.1000. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.500 చొప్పున చెల్లించాలి. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.45,960 నుంచి రూ,1,24,150 వరకు, సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.42,300 నుంచి రూ.1,15,270, ల్యాబ్ టెక్నీషియన్‌  పోస్టులకు రూ24,280 నుంచి రూ.72,850 వరకు, ల్యాబ్ అటెండెంట్‌  పోస్టులకు రూ.20,280 నుంచి రూ.62,110 వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

చెత్త సలహాలు వద్దు..ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్‌పై కోచ్ గంభీర్ ఫైర్
చెత్త సలహాలు వద్దు..ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్‌పై కోచ్ గంభీర్ ఫైర్
చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం