JNTU Hyderabad: బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫెయిలైన విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. క్రెడిట్‌ పాయింట్లు 75 శాతానికి తగ్గింపు

|

Dec 22, 2023 | 11:20 AM

పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు పైచదువుల్లో రానించలేకపోతున్నారు. దీంతొ ఇంజినీరింగ్‌లో చేరిన తొలి ఏడిదిలోనే ఫెయిలవుతున్నారు. ఇలా ప్రతీయేట ఇంజనీరింగ్‌లో వందల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించలేక చతికిల పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అలాంటి విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోషన్‌ ఇచ్చేందుకు వీలుగా వినూత్న నిర్ణయం..

JNTU Hyderabad: బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫెయిలైన విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. క్రెడిట్‌ పాయింట్లు 75 శాతానికి తగ్గింపు
JNTU Hyderabad
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు పైచదువుల్లో రానించలేకపోతున్నారు. దీంతొ ఇంజినీరింగ్‌లో చేరిన తొలి ఏడిదిలోనే ఫెయిలవుతున్నారు. ఇలా ప్రతీయేట ఇంజనీరింగ్‌లో వందల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించలేక చతికిల పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అలాంటి విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోషన్‌ ఇచ్చేందుకు వీలుగా వినూత్న నిర్ణయం తీసుకుంది. మొదటి ఏడాది అకడమిక్‌ క్రెడిట్స్‌ను 75 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఉస్మానియా యూనిర్సిటీ అధికారులు కూడా ఈ విద్యా సంవత్సరానికి క్రెడిట్స్‌ వ్యవస్థనే పూర్తిగా తొలగించింది. అయితే ఇలా క్రెడిట్స్‌ను తగ్గించి విద్యార్థులకు ప్రమోషన్‌ ఇస్తున్నా మిగిలిన సెమిస్టర్లలో వారికి ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. విభిన్న నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం పెరగకపోవడంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అందుకు పలు కారణాలు ఉన్నట్లు గుర్తించారు. అవేంటంటే..

  • ఇంటర్మీడియట్‌ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్ధుల్లో చాలామందికి ఒకేసారి ఇంగ్లిష్‌లో చదవాలంటే ఇబ్బంది కావడం
  • అప్పటి వరకు గ్రామాల్లో చదువుకున్న విద్యార్ధులు నగరాల పరిస్థితులకు అలవాటు పడలేకపోవడం
  • ఉస్మానియా, జేఎన్‌టీయూలలో సరైన సంఖ్యలో ప్రొఫెసర్లు, అధ్యాపకులు లేకపోవడం
  • కొత్తగా వచ్చిన సైబర్‌ భద్రత, కృత్రిమమేధ, డేటాసైన్స్‌ వంటి కోర్సులపై కొందరు అధ్యాపకులకు పూర్తిస్థాయిలో అవగాహన కొరవడటం

పై కారణాలతోపాటు బోధనా ప్రమాణాలు తగ్గిపోవడం వల్ల ఫెయిలవుతున్న విద్యార్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. డిటెన్షన్‌ విధానంతో విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావం కలుగుతోందని చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో క్రెడిట్స్‌ తగ్గింపు కేవలం ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమేనని అంటున్నారు. పాఠాలు అర్థం కావడంలేదని, ఫెయిలవుతున్నారని రెండో సంవత్సరానికి ప్రమోషన్‌ కోసం క్రెడిట్స్‌ను తగ్గించడం సరికాదని ఉస్మానియా మాజీ వీసీ ఎ.రామచంద్రం సూచిస్తున్నారు. బోధనా ప్రమాణాలు పెంచితేగానీ విద్యార్ధుల నైపుణ్యాలు మెరుగుపడవని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.