​JIPMER Recruitment 2022: జిప్‌మర్‌లో 433 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Nov 03, 2022 | 3:59 PM

భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌).. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

​JIPMER Recruitment 2022: జిప్‌మర్‌లో 433 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
​JIPMER Pondicherry Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌)..433 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 80 శాతం ఉద్యోగాలు మహిళలకు మాత్రమే కేటాయిస్తారు. మిగిలిన పోస్టులు ఇతర అభ్యర్ధులకు కేటాయిస్తారు.ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్- సర్టిఫికేట్)/బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్), జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో రెండేళ్ల పని అనుభవం కూడా ఉండాలి.

అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 1, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.1200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్‌ 18వ తేదీన నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.44,900ల వరకు జీతంతోపాటు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.