JEE Main 2025 Admit Cards: జేఈఈ మెయిన్ అడ్మిట్‌ కార్డులు వచ్చేశాయ్‌.. డైన్‌లోడ్‌ లింక్‌ ఇదే

|

Jan 19, 2025 | 2:34 PM

దేశ వ్యాప్తంగా ఉన్న NITల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌/ బీఆర్క్‌ సీట్ల భర్తీకి జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్ లైన్ పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. డౌన్ లోడ్ లింక్ ఈ కింద చెక్ చేసుకోండి..

JEE Main 2025 Admit Cards: జేఈఈ మెయిన్ అడ్మిట్‌ కార్డులు వచ్చేశాయ్‌.. డైన్‌లోడ్‌ లింక్‌ ఇదే
JEE Main 2025 Admit Cards
Follow us on

హైదరాబాద్‌, జనవరి 19: దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంత్సరానికి సంబంధించి బీటెక్‌/ బీఆర్క్‌ సీట్ల భర్తీకి జనవరి 22వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ తొలివిడత రాత పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు కూడా ఎన్టీయే విడుదల చేసింది. తాజాగా జేఈఈ మెయిన్‌ 2025 మొదటి విడత (సెషన్‌ 1) రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్ధుల వివరాలు నమోదు చేసి, వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ వివరాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పొందుపరిచింది. ప్రస్తుతానికి జనవరి 22, 23, 24 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు మాత్రమే విడుదలయ్యాయి.

జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు విడుదల అవుతాయి. జనవరి 22వ తేదీ నుంచి బీఈ, బీటెక్‌ పేపర్‌1 రాత పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఆయా తేదీల్లో మొదటి షిఫ్ట్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. ఇక జనవరి 31 తేదీన సెకండ్‌ షిఫ్ట్‌లో బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ పేపర్‌ 2ఏ, 2బీ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరుగుతాయి.

జేఈఈ మెయిన్ 2025 తొలి విడత అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

సీమ్యాట్‌ 2025 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు వచ్చేశాయ్‌.. పరీక్ష ఎప్పుడంటే?

కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌ 2025) పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. సీమ్యాట్‌ 2025 పరీక్ష జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా 7 నగరాల్లో ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. సీమ్యాట్‌లో వచ్చిన స్కోరు ఆధారంగా 2025-2026 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యికిపైగా విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

సీమ్యాట్‌ 2025 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.