JEE Main 2024 Results: సోమవారం జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఫలితాలు విడుదల.. చివరి విడత దరఖాస్తులకు చివరి తేదీ ఇదే

|

Feb 11, 2024 | 9:42 PM

జేఈఈ మెయిన్‌ తొలి విడత సెషన్‌ 1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌ కీని జాతీయ పరీక్షల సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12న వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్‌ చివరి విడత అంటే సెషన్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్‌టీఏ స్పష్టం చేసింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన..

JEE Main 2024 Results: సోమవారం జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఫలితాలు విడుదల.. చివరి విడత దరఖాస్తులకు చివరి తేదీ ఇదే
JEE Main 2024 Session 1 results
Follow us on

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: జేఈఈ మెయిన్‌ తొలి విడత సెషన్‌ 1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌ కీని జాతీయ పరీక్షల సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12న వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్‌ చివరి విడత అంటే సెషన్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్‌టీఏ స్పష్టం చేసింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు సెషన్‌ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రెండు విడతల పరీక్షలు రాసిన వారికి, రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ఎన్టీయే ర్యాంకును కేటాయిస్తుంది. తొలి విడత పేపర్‌-1 పరీక్షకు మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 11,70,036 మంది విద్యార్థులు అంటే 95.8 శాతం మంది హాజరయ్యారని ఎన్‌టీఏ వెల్లడించింది. జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 55,493 అంటే 75 శాతం మంది హాజరయ్యారు. పేపర్‌ 2లో అర్హత సాధించిన వారికి ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీప్లానింగ్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు పరీక్షలు ఎస్సెస్సీ కానిస్టేబుల్ పరీక్షలు..

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టుల భర్తీకి ఈ నెల 29వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు నియామక రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మళయాళం, ఉర్దూ.. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ప్రశ్నాపత్రం ఇవ్వనున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌లో ప్రకటించింది కూడా. పరీక్ష కేంద్రాల వివరాలు, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకునేందుకు అందుబాటులో ఉంచింది. అడ్మిట్‌ కార్డులో రోల్‌ నంబర్‌, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు వంటి తదితర సమాచారం ఉంటుంది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 26,146 పోస్టులు భర్తీ కానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి పరీక్ష కేంద్రం, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలు తెలుసుకోవచ్చు. త్వరలో అడ్మిట్‌ కార్డులు విడుదల కానున్నాయి. కానిస్టేబుల్‌ కొలువులకు రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా తుది ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.