JEE Advanced 2023: నేటితో ముగుస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు గడువు.. పరీక్ష తేదీ వివరాలివే..

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లలో జరిగిన జేఈఈ మెయిన్‌ మొదటి, చివరి విడతలో..

JEE Advanced 2023: నేటితో ముగుస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు గడువు.. పరీక్ష తేదీ వివరాలివే..
JEE Advanced 2023

Updated on: May 07, 2023 | 1:48 PM

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లలో జరిగిన జేఈఈ మెయిన్‌ మొదటి, చివరి విడతలో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ర్యాంకుల్ని ప్రకటించింది. జేఈఈ ఆడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినవారు ఏప్రిల్‌ 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ప్రకటించింది కూడా. ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు దరఖాస్తులకు గడువు నేటితో (మే 7) ముగుస్తుంది. మే 7లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, మే 8 సాయంత్రం 5గంటలలోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది.

ఐఐటీ గువహటి షెడ్యూల్‌లో వెల్లడించిన ప్రకారం.. మే 29 నుంచి జూన్‌ 4వరకు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 4న పరీక్ష జరగనుంది. పేపర్‌ 1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్‌ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. ఈ పరీక్ష ప్రాథమిక సమాధానాల కీ జూన్‌ 11న విడుదలవుతుంది. ఫలితాలు జూన్‌ 18న విడుదలకానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.