AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Jobs 2025: ఇంజనీరింగ్ ఫ్రెషర్స్‌కి భలేఛాన్స్‌.. క్యాంపస్‌ సెలక్షన్లకు రెడీ అంటోన్న దిగ్గజ ఐటీ కంపెనీలు!

ఈ ఆర్థిక సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను వేలాది మందిని నియమించుకుంటామని భారత్‌లోని రెండు దిగ్గజ ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 20 వేల మంది కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ గురువారం (ఏప్రిల్ 18) తెలిపింది. మరోవైపు ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌ కూడా..

IT Jobs 2025: ఇంజనీరింగ్ ఫ్రెషర్స్‌కి భలేఛాన్స్‌.. క్యాంపస్‌ సెలక్షన్లకు రెడీ అంటోన్న దిగ్గజ ఐటీ కంపెనీలు!
Infosys Hiring
Srilakshmi C
|

Updated on: Apr 18, 2025 | 11:22 AM

Share

ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ఆదాయ వృద్ధి బలహీనంగా ఉండనుంది. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను వేలాది మందిని నియమించుకుంటామని భారత్‌లోని రెండు దిగ్గజ ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 20 వేల మంది కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ గురువారం (ఏప్రిల్ 18) తెలిపింది. మరోవైపు ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌ కూడా ఈ ఏడాది 42 వేల వరకు నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. డిమాండ్ దృష్ట్యా క్యాంపస్ నియామకాలు తిరిగి ప్రారంభించనున్నట్లు విప్రో సైతం తెలిపింది.

అయితే ఈ నియామకాలు ఎక్కువగా ప్రాజెక్ట్ ర్యాంప్-అప్‌, కాంట్రాక్ట్ బేసిస్‌పై చేపట్టే అవకాశం ఉంది. ఏదేమైనా కంపెనీలు మరింత జాగ్రత్తగా ముందుకు సాగవల్సి ఉంది. ఎందుకంటే ఐటీ సేవల కంపెనీల నుంచి డిమాండ్ ఇప్పటికే మందగమనంలో ఉన్నట్లు హ్యూమన్‌ రీసోర్సెస్‌ సంస్థలు చెబుతున్నాయి. కోవిడ్‌ మహమ్మారి తర్వాత ఐటీ కంపెనీల నియామకాలు గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా మందగమనంలో సాగుతున్నాయి. మరిన్ని ఎంట్రీ-లెవల్ పనులు ఆటోమేటెడ్ కావడం, AI ఏజెంట్లచే కోడ్‌లు రాయబడటం వలన పెద్ద సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం తగ్గింది. ఈ ఏడాది మొత్తం ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 6,338 పెరిగింది. మార్చి 31 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,578కి చేరుకుంది. నాల్గవ త్రైమాసికంలో స్వచ్ఛంద తొలగింపులు 14.1 శాతానికి పెరిగాయి. గత ఏడాది ఇది 12.6 శాతంగా ఉంది. ఇక టీసీఎస్‌లో 6,433 మందిని, విప్రో 732 మందిని కొత్తగా చేర్చుకుంది.

ఇన్ఫోసిస్ తన మిగిలిన ఉద్యోగుల జీతాల పెంపు ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వేతనాల పెంపుపై దృష్టి పెడుతున్నామని తెలిపింది. జనవరిలో ఎక్కువ భాగం వేతన పెంపుదల ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెస్తున్నారని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా అన్నారు. కంపెనీ తన ఉద్యోగులకు సగటున 5 నుంచి 8 శాతం పెంపుదల ప్రకటించింది. ఇది గతేడాది కంటే తక్కువ. ఇన్ఫోసిస్ ఉద్యోగుల పనితీరును నాలుగు వర్గాలుగా వర్గీకరిస్తుంది. అత్యుత్తమమైనది, ప్రశంసనీయమైనది, అంచనాలను అందుకుంది మరియు మెరుగుదల అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.