IRCON Jobs 2022: నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో..ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ (New Delhi)లోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON ) జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుల (Joint General Manager Posts) భర్తీకి..

IRCON Jobs 2022: నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో..ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు
Ircon Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 18, 2022 | 11:04 AM

IRCON Joint General Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ (New Delhi)లోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON ) జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుల (Joint General Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 23

  • జాయింట్ జనరల్ మేనేజర్‌ పోస్టులు: 1
  • డిప్యూటీ జనరల్ మేనేజర్‌ పోస్టులు: 1
  • మేనేజర్‌ పోస్టులు: 1
  • డిప్యూటీ జనరల్ పోస్టులు: 2
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు: 12
  • ఎగ్జిక్యూటివ్‌/ఎటక్ట్రికల్‌ పోస్టులు: 6

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.40,000ల నుంచి రూ.2,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Sainik School Kalikiri Jobs 2022: టెన్త్ అర్హతతో.. చిత్తూరులోని కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.56,900ల జీతం..