నిరుద్యోగులకి అలర్ట్‌.. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో 650 పోస్ట్‌లు.. మరో రెండు రోజులే గడువు..!

|

May 18, 2022 | 9:53 AM

IPPB GDS Recruitment 2022: ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది.

నిరుద్యోగులకి అలర్ట్‌..  ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో 650 పోస్ట్‌లు.. మరో రెండు రోజులే గడువు..!
Ippb Gds Recruitment 2022
Follow us on

IPPB GDS Recruitment 2022: ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. ఇంకా ఇప్పటి వరకు అప్లై చేసుకోలేని అభ్యర్థులు IPPB అధికారిక వెబ్‌సైట్ – ని సందర్శించి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపవచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ 20 మే 2022న ముగుస్తుంది. చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది చాలా మంచి అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 10 మే 2022 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయాలి. ఇందులో ఎంపికైతే అభ్యర్థులను వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లలో నియమిస్తారు.

ఈ పోస్టులకి ఎలా దరఖాస్తు చేయాలి..?

1. ఈ పోస్టులకి దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ కివెళ్లండి.

ఇవి కూడా చదవండి

2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో కెరీర్ విభాగానికి వెళ్లండి.

3. తర్వాత IPPBకి గ్రామీణ డాక్ సేవకుల ఎంగేజ్‌మెంట్ ప్రకటన లింక్‌కి వెళ్లండి.

4. ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి అనే లింక్‌పై క్లిక్ చేయండి.

5. ఆ తర్వాత మొబైల్ నంబర్ ఈ మెయిల్ సహాయంతో నమోదు చేసుకోండి.

6. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.

ఎంపిక ప్రక్రియ

ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్షలో IPPB ప్రోడక్ట్ సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు, బేసిక్ బ్యాంకింగ్ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 ప్రశ్నలు, కంప్యూటర్ అవేర్‌నెస్, డిజిటల్ చెల్లింపుల నుంచి 20 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 10 మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

అర్హత & వయో పరిమితి

పోస్టల్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో హాజరు కావాలంటే అభ్యర్థి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దీంతో పాటు అభ్యర్థికి 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. అదే సమయంలో వయస్సు 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టల్ శాఖ చేసే రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన తర్వాత అభ్యర్థులకు ప్రతి నెలా ప్రతి నెలా రూ.30,000 వేతనం ఉంటుంది.

మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి