TMC Recruitment: టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు.. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
TMC Recruitment: టాటా మెమోరియల్ సెంటర్(TMC) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ పరిధిలోని భాభా క్యాన్సర్ హాస్సిటల్ (HBCH)- సంగ్రూర్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో...
TMC Recruitment: టాటా మెమోరియల్ సెంటర్(TMC) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ పరిధిలోని భాభా క్యాన్సర్ హాస్సిటల్ (HBCH)- సంగ్రూర్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్న ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో నర్స్ ఎడ్యుకేటర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, హెల్పర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ లా ఆఫీసర్ వంటి ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎస్ఎస్‌సీ(పదోతరగతి), సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూను 30-05-2022న నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత అకడమిక్ సర్టిఫికేట్లు తీసుకొని రావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యును రూమ్ నెం 312, హెచ్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్, న్యూ సర్జికల్ బ్లాక్, హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, సంగ్రూర్ – 148001 అడ్రస్‌లో నిర్వహించనున్నారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13,400 నుంచి రూ. 45,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..