IOCL Jobs 2026: టెన్త్ అర్హతతో.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
విధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 501 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది..

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 501 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 12, 2026వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, టెలీకమ్యూనికేషన్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, మెషినిస్ట్, డేటా ఎంట్రీ, సివిల్, ఫిట్టర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
రాష్ట్రాల వారిగా ఖాళీల వివరాలు ఇవే..
- ఢిల్లీలో ఖాళీల సంఖ్య: 120
- హరియాణలో ఖాళీల సంఖ్య: 30
- పంజాబ్‌లో ఖాళీల సంఖ్య: 49
- చండీగఢ్‌లో ఖాళీల సంఖ్య: 30
- హిమాచల్ ప్రదేశ్‌లో ఖాళీల సంఖ్య: 09
- జమ్మూ కశ్మీర్‌లో ఖాళీల సంఖ్య: 08
- రాజస్థాన్‌లో ఖాళీల సంఖ్య: 90
- ఉత్తర్ ప్రదేశ్‌లో ఖాళీల సంఖ్య: 140
- ఉత్తరాఖండ్‌లో ఖాళీల సంఖ్య: 25
ఈ పోస్టులను అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి డిసెంబర్ 31, 2025 తేదీ నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా జనవరి 12, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి నెలా నోటిఫికేషన్‌లో సూచించిన మేరకు స్టైపెండ్ కూడా చెల్లిస్తారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీల పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




