నిరుద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏతోపాటు టెట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 01, 2025 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 6, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ ఈబీసీ/ మైనారిటీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్‌లేషన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.