Indian Navy Jobs: బీటెక్‌ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

|

Feb 06, 2022 | 8:53 AM

Indian Navy Jobs: ఇండియన్‌ నేవీల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్పెషల్‌ ఓరియంటేషన్‌ కోర్సులో భాగంగా ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Indian Navy Jobs: బీటెక్‌ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Follow us on

Indian Navy Jobs: ఇండియన్‌ నేవీల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్పెషల్‌ ఓరియంటేషన్‌ కోర్సులో భాగంగా ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఇందులో ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ -షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ (సీఎస్‌/సీఎస్‌ఈ లేదా ఐటీ) ఉత్తీర్ణత లేదా ఎమ్మెస్సీ (సీఎస్‌/ఐటీ) లేదా ఎంసీఏ/ఎంటెక్‌ (సీఎస్‌/ఐటీ) ఉత్తీర్ణత. అంతేకాకుండా నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థులు 1997 జులై2 – 2003, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* గతంలో ఈ పోస్టులను ఇండయిన్‌ నేవీ ఎంట్రన్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా నిర్వహించే వారు. కానీ కరోన కారణంగా నిర్వహించడం లేదు.

* దరఖాస్తు చేసుఉన్న అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు కోర్సును కేరళ ఎజిమళలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ)లో నిర్వహిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 10-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Horoscope Today: ఈ రాశుల వారికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది.. ఈరోజు రాశి ఫలాలు..

Shankar’s daughter: మెగా హీరో సినిమా కోసం పాట పాడిన టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు…

Under-19 World Cup 2022 : ఐదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ గెలుచుకున్న యంగ్ ఇండియా