IIFT Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 13 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ట్రేడ్ ఆపరేషన్లు, లాజిస్టిక్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఐటీ, మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగులను తీసుకోనున్నారు.
* ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ/ సీఏ/ సీఎస్/ ఐసీడబ్ల్యూఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఏబీడీసీ/ ఏబీఎస్‌లో జర్నల్‌లు ప్రచురితం కావాలి. సంబంధిత విభాగంలో 10 ఏళ్లు అనుభవం ఉండాలి.
* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వారు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. నెట్, ఎస్ఎల్ఈటీ/ ఎస్ఈటీ అర్హత సాధించాలి. సంబంధిత విభాగంలో 2 ఏళ్లు అనుభవం ఉండాలి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీగా 26.05.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.