IIFPT Recruitment: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

|

Jun 19, 2021 | 6:17 AM

IIFPT Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ(ఐఐఎఫ్‌పీటీ).. ప‌లు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా...

IIFPT Recruitment: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Iifpt Recruitment 2021
Follow us on

IIFPT Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ(ఐఐఎఫ్‌పీటీ).. ప‌లు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 3 ఫ్యాకల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..
* మొత్తం మూడు ఖాళీల‌కు గాను అసోసియేట్‌ ప్రొఫెసర్ (01), అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (02) రిక్రూట్ చేయ‌నున్నారు.

* అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలడంతో పాటు పనిలో అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 47 ఏళ్లు మించ‌కూడ‌దు.

* అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి అలాగే అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థుల వ‌య‌సు 32ఏళ్లు మించకుండా ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తును ది డైరెక్టర్, ఐఐఎఫ్‌పీటీ, పుడుకొట్టాయ్‌ రోడ్, తంజావూర్‌–613005 అడ్ర‌స్‌కు పంపించాలి.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా 20-07-2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Janasena Party: జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారు.. నాదెండ్ల మనోహర్ ఫైర్..

AP High Court: ధూళిపాళ్ల బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్.. నిబంధనలు ఉల్లంఘించారంటూ వాదన..

Cheating: ద్వారకా తిరుమలలో ఘరానా మోసం.. బ్యాంకు ఉద్యోగిని అని చెప్పి ఏకంగా..