Indian Army Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివిన వారికి గొప్ప అవకాశం.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్..

|

Mar 15, 2022 | 10:41 PM

Indian Army Recruitment 2022: బీటెక్‌ చేసిన నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ (joinindianarmy.nic.in) లో విడుదల

Indian Army Recruitment 2022: ఇంజనీరింగ్‌ చదివిన వారికి గొప్ప అవకాశం.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్..
Indian Army Recruitment 202
Follow us on

Indian Army Recruitment 2022: బీటెక్‌ చేసిన నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్  లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అర్హులైన అవివాహిత పురుష, మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి షార్ట్ సర్వీస్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించారు. తమిళనాడులోని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో అక్టోబర్ 2022లో కోర్సు ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌లో తెలిపారు.

ఖాళీల వివరాలు..

SSC(టెక్) కోసం – 175

SSCW(టెక్) కోసం – 14

విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ – 02

(SSC(W) టెక్ – 01

SSC(W) (నాన్ టెక్) (UPSC కానిది) – 01)

విద్యార్హత: ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయో పరిమితి: SSC (టెక్), SSCW(టెక్) పోస్టులకి అక్టోబర్ 1, 2022 నాటికి 20 నుంచి 27 సంవత్సరాలు. అంటే (అభ్యర్థులు 02 అక్టోబర్ 1995, 01 అక్టోబర్ 2002 మధ్య జన్మించినవారు అర్హులు.) మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు: అక్టోబర్ 1, 2022 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాల వయస్సు ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి.

2. ‘ఆఫీసర్ ఎంట్రీ లాగిన్’పై క్లిక్ చేయాలి.

3. ‘రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయాలి.

4. ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివిన తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపండి.

5. రిజిస్టర్ చేసుకున్న తర్వాత డ్యాష్‌బోర్డ్ కింద ‘అప్లై ఆన్‌లైన్’పై క్లిక్ చేయండి.

6. ‘అధికారుల ఎంపిక – ‘అర్హత’ అనే పేజీ ఓపెన్‌ అవుతుంది.

7. ‘దరఖాస్తు ఫారమ్’ పేజీ ఓపెన్‌ అవుతుంది.

8. అవసరమైన వివరాలను నింపడానికి సూచనలను జాగ్రత్తగా చదవండి. తర్వాత ‘కొనసాగించు’ క్లిక్ చేయండి.

9. వివరాలను నింపిన తర్వాత ‘సమర్పించు’పై క్లిక్ చేయండి.

10. ఆన్‌లైన్ దరఖాస్తును ముగించిన 30 నిమిషాల తర్వాత అభ్యర్థులు దరఖాస్తు రోల్ నంబర్‌తో సహా రెండు కాపీలను జిరాక్స్‌ తీసుకోవాలి.

చివరి తేదీ ఎప్పుడంటే..?

అభ్యర్థులు ఏప్రిల్ 6 (సాయంత్రం 3) లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Viral Video: పెట్రోల్ ధరల కంటే గుర్రం దాణా ఖర్చులే తక్కువ.. బైక్ కు ప్రత్యామ్నాయంగా అశ్వం

Cat Video: బాబోయ్‌ పిల్లి కరిచింది..ఇద్దరు మహిళలు మృతి.. వినడానికి వింతగా ఉన్న.. విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Shingarakonda Temple: శింగరకొండ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపటి నుంచి తిరునాళ్లు