కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఒరిస్సాలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్.. అసిస్టెంట్ ట్రైనీ (ఆపరేటర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఫెర్టిలైజర్/హెవీ కెమికల్ ఇండస్ట్రీ/పెట్రోలియం రిఫైనరీ/పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి. దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా పోస్టును బట్టి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 13, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ.31,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం నెలకు రూ. 34,000ల నుంచి రూ.64,000ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.