ICMR-RMRC Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో రీజనల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో రీసెర్చ్‌ స్టాఫ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

|

Oct 22, 2022 | 8:04 AM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పోర్టు బ్లెయిర్‌లోని ఐసీఎంఆర్ - రీజనల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌.. 26 సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, డీఈవో, సైంటిస్ట్‌ సీ, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి..

ICMR-RMRC Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో రీజనల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో రీసెర్చ్‌ స్టాఫ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
ICMR-RMRC Port Blair Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పోర్టు బ్లెయిర్‌లోని ఐసీఎంఆర్ – రీజనల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌.. 26 సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, డీఈవో, సైంటిస్ట్‌ సీ, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌/ గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీ/లైఫ్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ/ సోషల్‌ సైన్సెస్‌లో ఎంఏ/ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/ఎంబీఎస్‌సీ/ఎంటెక్‌/ఎంఎస్‌/ఎండీ/డీఎన్‌బీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 22 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 9, 11, 14, 16, 18, 21 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.16,000ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు: 1
  • ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ పోస్టులు: 1
  • డీఈవో పోస్టులు: 4
  • సైంటిస్ట్‌-సీ పోస్టులు: 3
  • రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • సైంటిస్ట్‌-బీ పోస్టులు: 2
  • ఫీల్డ్‌ వర్కర్‌ పోస్టులు: 1
  • ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ పోస్టులు: 11
  • ప్రాజెక్ట్ మేనేజర్‌ పోస్టులు: 1
  • రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టులు: 1

అడ్రస్: ICMR- REGIONAL MEDICAL RESEARCH CENTRE, Dollygunj, Port Blair and ICMR New Delhi

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.