IBPS PO SO Recruitment 2024: ఐబీపీఎస్‌ 5351 పీఓ, ఎస్‌ఓ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

|

Aug 01, 2024 | 6:34 PM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) 2025 - 2026 సంవత్సరానికి గానూ కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీస‌ర్, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు..

IBPS PO SO Recruitment 2024: ఐబీపీఎస్‌ 5351 పీఓ, ఎస్‌ఓ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
IBPS PO SO Recruitment
Follow us on

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) 2025 – 2026 సంవత్సరానికి గానూ కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం 5351 ప్రొబేషనరీ ఆఫీస‌ర్, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ భారీగా ఖాళీలున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 21, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అక్టోబర్‌లో పీఓ, నవంబర్‌లో ఎస్‌ఓ ప్రిలిమ్స్‌ పరీక్షలు ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాగా గతేడాది మొత్తం 3,049 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను, 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంతకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయని అంచనా. ఎంపికై అభ్యర్ధులకు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకుల్లో పోస్టింగ్‌ ఇస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: ఆగస్టు 1, 2024.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ముగింపు తేదీ: ఆగస్టు 21, 2024.
  • ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు తేదీలు: ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21, 2024 వరకు
  • ప్రీ ఎగ్జాం ట్రైనింగ్‌ తేదీ: సెప్టెంబర్ 2024
  • ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు: పీఓ పోస్టులకు అక్టోబర్‌లో, ఎస్‌ఓ పోస్టులకు నవంబర్‌లో ఉంటుంది
  • ప్రిలిమిన‌రీ పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: పీఓ పోస్టులకు నవంబర్‌లో, ఎస్‌ఓ- నవంబర్‌/ డిసెంబర్‌లో.
  • మెయిన్స్‌ పరీక్ష తేదీలు: పీఓ పోస్టులకు నవంబర్‌లో, ఎస్‌ఓ పోస్టులకు డిసెంబర్‌లో
  • మెయిన్స్‌ ఫలితాల వెల్లడి తేదీ: పీఓ పోస్టులకు డిసెంబర్‌ లేదా జనవరి 2025లో, ఎస్‌ఓ పోస్టులకు జనవరి లేదా ఫిబ్రవరి 2025లో
  • ఇంటర్వ్యూ నిర్వహణ: పీఓ పోస్టులకు జనవరి/ ఫిబ్రవరి 2025, ఎస్‌ఓ పోస్టులకు ఫిబ్రవరి/ మార్చి 2025లో
  • ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌: ఏప్రిల్‌ 2025లో ఉంటుంది

 

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.